Saturday, January 18, 2025

అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

‘అంబేద్కర్ జపం చేయడం ఫ్యాషన్ అయింది. వారు అలా అన్ని సార్లు భగవంతుని నామం జపిస్తే స్వర్గంలో చోటు పొంది ఉండేవారు’
అమిత్‌షా

హోంమంత్రి అమిత్‌షాపై విపక్షం
ఫైర్ రాజీనామా చేయాలని
డిమాండ్ పార్లమెంట్ ఉభయ
సభల్లో రభస..వాయిదా అమిత్‌షాపై
టిఎంసి హక్కుల నోటీసు

న్యూఢిల్లీ : డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోమ్ శాఖ మం త్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బుధవారం పార్లమెంట్‌లో ప్ర కంపనలు సృష్టించాయి. అమిత్ షా క్షమాపణను ప్రతిపక్ష స భ్యులు కోరగా, అధికార పక్షం నుంచి మంత్రులు వాటి డి మాండ్‌ను తోసిపుచ్చడమే కాకుంగా అంబేద్కర్‌ను అవమానించింది కాంగ్రెస్ పార్టీయేనని ప్రత్యారోపణ చేశారు. ప్రతిపక్షాల నిరసనలు సద్దుమణగక పోవడంతో తొలుత రాజ్యసభ, తరువాత లోక్‌సభ గురువారానికి వాయిడా పడ్డాయి. ప్రతిపక్ష స భ్యుల నిరసనలు రాజ్యసభను బుధవారం కుదిపివేశాయి. భా రత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్‌పై మంగళవారం సభ లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఆయనకు ‘అవమానకరం’ అ ని ఆరోపిస్తూ, మంత్రి క్షమాపణ చెప్పాలని కోరారు.

రాజ్యసభ లో అమిత్ షా చేసిన వ్యాఖ్యల్లో ఒక భాగాన్ని మాత్రమే వాడుకుంటూ కాంగ్రెస్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు, అంబేద్కర్‌ను కాంగ్రెస్ ఏవిధంగా కించపరచిందీ హోమ్ శాఖ మంత్రి విస్పష్టంగా చెప్పారని రిజిజు తెలియజేశారు. ‘అమిత్ షా మొత్తం ప్రసంగంలో నుంచి ఒక 1112 సెకన్ల క్లిప్‌ను మీరు (కాంగ్రెస్) వాడుకుని, దేశాన్ని తప్పు దోవ పట్టించజాలరు’ అని రిజిజు అన్నారు. బిజెపికి అంబేద్కర్ దేవునితో సమానం అని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రతిపక్షాలు తమ పంతం వీడలేదు. నినాదాల నడుమ సభను లంచ్ తరువాత సమావేశమైన కొద్ది సేపటికే పూర్తిగా వాయిదా వేశారు. బుధవారం ఉదయం పత్రాలు, నివేదికలు సమర్పించిన తరువాత సభ నిర్ణీత జీరో అవర్‌తో ముందుకు సాగింది.

ఆ తరువాత కాంగ్రెస్ ఎంపి జైరామ్ రమేష్ లేచి రాజ్యాంగంపై చర్చ సమయంలో అమిత్ షా తన వ్యాఖ్యలతో అంబేద్కర్‌ను అవమానించారని ఆరోపించారు. ఇతర కాంగ్రెస్ సభ్యులు పలువురు లేచి, ‘అంబేద్కర్‌కు అవమానాన్ని భారత్ సహించదు’ వంటి నినాదాలు చేయసాగారు. వారి ఆరోపణలను రిజిజు తిప్పికొడుతూ, అంబేద్కర్‌ను అవమానించింది, ఆయనను భారత రత్నతో సత్కరించనిది కాంగ్రెసేనని అన్నారు. అంబేద్కర్ పోస్టర్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ప్రదర్శించారు. గలభా నడుమ చైర్మన్ జగ్దీప్ థన్‌ఖడ్ కొన్ని నిమిషాల్లోనే సభను మధ్యాహ్నం 2 వరకు వాయిదా వేశారు. భోజన వ విరామం తరువాత మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు బుధవారానికి రెండు బిల్లులు ద్రవ్య వినియోగ బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్ బిల్లు సమర్పించవలసి ఉందని తెలిపారు. సభను పని చేయనివ్వాలని, బ్యాంకింగ్ రెగ్యులేషన్ బిల్లుపై చర్చ ప్రారంభించాలని ప్రతిపక్షాలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ, అమిత్ షా మంగళవారం అంబేద్కర్‌ను ‘అవమానించారు’ అని ఆరోపించారు. తివారి వాదనను రిజిజు తిరస్కరిస్తూ, రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యల్లో ఒక భాగాన్ని మాత్రమే వాడడం ద్వారా కాంగ్రెస్ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఏవిధంగా అంబేద్కర్‌ను కించపరచిందీ హోమ్ శాఖ మంత్రి తన ప్రసంగంలో విస్పష్టంగా చెప్పారని ఆయన తెలిపారు. అంబేద్కర్ ముంబయి నుంచి, ఆ తరువాత విదర్భ నుంచి పోటీ చేసినప్పుడు ఆయన ఓటమికి కాంగ్రెస్ కుట్ర పన్నిందని హోమ్ శాఖ మంత్రి మంగళవారం ఆరోపించారని రిజిజు వివరించారు.

అంబేద్కర్ లోక్‌సభకు తిరిగి ఎన్నికవ్వాలని కోరుకున్నారని, కానీ కాంగ్రెస్ ఆయనను అలా చేయనివ్వలేదని, దానితో ఆయన ఎన్నికల రాజకీయాలకు స్వస్తి చెప్పవలసి వచ్చిందని రిజిజు ఆరోపించారు. 1990 వరకు అంబేద్కర్‌కు భారత రత్న ప్రదానానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరిస్తూ వచ్చిందని కూడా రిజిజు చెప్పారు. అధికార, ప్రతిపక్ష సభ్యులు పరస్పరం నినాదాలు చేసుకున్నారు. రభస నేపథ్యంలో చైర్మన్ సభను గురువారానికి వాయిదా వేశారు.

లోక్‌సభలో అదే తీరు

అంబేద్కర్‌పై వ్యాఖ్యలకు గాను అమిత్ షా క్షమాపణ చెప్పాలని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండగా లోక్‌సభ బుధవారం మధ్యాహ్నం 2 వరకు తొలుత వాయిదా పడింది. తిరిగి సమావేశమైనప్పుడు నిరసనలు కొనసాగాయి. గలభా నడుమ మంత్రులు, ఎంపిలు పార్లమెంటరీ పత్రాలు సమర్పించారు, ఆ తరువాత అధ్యక్ష స్థానంలో ఉన్న పిసి మోహన్ సభను పూర్తిగా వాయిదా వేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News