Monday, December 23, 2024

అమిత్ షా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య కోటి పైమాటే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇన్‌స్టాగ్రామ్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫాలోవర్ల సంఖ్య కోటిని దాటిపోయింది. క్రిమినల్ కోడ్, చట్టాలను ప్రక్షాళన చేస్తూ తీసుకువచ్చిన మూడు బిల్లులతో పాటుగా కొన్ని చరిత్రాత్మక బిల్లులకు పార్లమెంటు ఇటీవల ఆమోదం తెలిపిన తర్వాత అమిత్ షా ఫాలోవర్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి. భారతీయ జనతా పార్టీలో కీలక వ్యూహకర్తల్లో ఒకరైన అమిత్ షాకు ఎక్స్( గతంలో ట్విట్టర్)లో 34.1 మిలియన్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 10.7 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 15 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లను కలిగిన వ్యక్తిగా ఆయన ఉన్నారు. సోషల్ మీడియాలో అత్యధికంగా కనిపించే ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఫేస్‌బుక్‌లో 6.8 మిలియన్లు,

ఇన్‌స్టాగ్రామ్‌లో 5.1 మిలియన్లు, ఎక్స్‌లో 24.7 మిలియన్ల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారని కూడా వారు గుర్తు చేస్తున్నారు. 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి ఘన విజయం సాధించిన తర్వాత అమిత్ షా ఆ పార్టీ అధ్యక్షుడు అయినప్పటినుంచి ఆయన ఫాలోవర్ల సంఖ్య పెరుగుతూ వస్తోందని పార్టీ నేతలు చెబుతున్నారు.2019లో బిజెపి తొలిసారికన్నా ఎక్కువ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అమిత్‌షాయే పార్టీ అధ్యక్షుడుగా ఉన్న విషయాన్నికూడా వారు గుర్తు చేస్తున్నారు. 2019లో మోడీ కేబినెట్‌లో హోంమంత్రిగా చేరిన అమిత్ షా ప్రభుత్వం తీసుకున్న అన్ని కీలక నిర్ణయాలు, చేపట్టిన ప్రతిష్ఠాత్మక పథకాల్లోను కీలక భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News