Friday, November 22, 2024

హిందీ మీడియంలో వైద్య విద్య ప్రాజెక్టును ప్రారంభించిన అమిత్‌షా

- Advertisement -
- Advertisement -

Amit Shah launch MP govt Hindi-medium

భోపాల్ : హిందీ భాషలో వైద్య విద్యను అందించే మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆదివారం ప్రారంభించారు. భోపాల్ లోని లాల్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో హిందీ మెడికల్ పాఠ్యపుస్తకాలను ఆవిష్కరించారు. మెడికల్ బయోకెమిస్ట్రీ, అనాటమీ, మెడికల్ ఫిజియోలజీ సబ్జెక్ట్ పాఠ్యపుస్తకాలను ఆవిష్కరించిన ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ నూతన జాతీయ విద్యావిధానం ద్వారా విద్యార్థుల మాతృభాషకు ప్రధాని మోడీ ప్రాధాన్యం ఇచ్చారని, రాబోయే రోజుల్లో చరిత్ర లిఖించేటప్పుడు ఈరోజు స్వర్ణాక్షరాలతో ముద్రితమవుతుందన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ మాట్లాడుతూ హిందీలో ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించిన తొలి రాష్ట్రం క్రెడిట్ మధ్యప్రదేశ్‌కే దక్కుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News