Wednesday, January 8, 2025

భారత్ పోల్ పోర్టల్ ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

కేసుల సత్వర విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యవస్థను ఆవిష్కరించింది. భారత్ పోల్ పేరిట తీసుకొచ్చిన పోర్టల్‌ను మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రారంభించారు. కేసుల విషయంలో కొత్త శకం ప్రారంభమైనట్టేనని ఈ సందర్భంగా మంత్రి అభివర్ణించారు. దర్యాప్తు సంస్థలు సరికొత్త సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకొని పరారీలో ఉన్న నేరగాళ్లను అదుపు లోకి తీసుకునేందుకు ఇది ఉపకరించనుంది. ఏజెన్సీలు వేగవంతంగా అంతర్జాతీయ పోలీసుల సహకారం తీసుకునేందుకు సీబీఐ సహకారంతో దీనిని అభివృద్ధి చేశారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన దర్యాప్తు సంస్థలు ఇంటర్‌పోల్‌తో సులువుగా కనెక్టు అయ్యేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సవాళ్లను గమనించి, మన వ్యవస్థల్లో మార్పులు చేసుకోవాల్సిన , ఆధునిక సాంకేతికతలను ఉపయోగించాల్సిన సమయం ఇది. ఆ దిశగా భారత్ పోల్ అనేది ఒక అడుగు. ” అని అమిత్‌షా వెల్లడించారు. ఈ కొత్త వ్యవస్థతోపాటు మూడు నేర చట్టాల గురించి రాష్ట్రాలకు శిక్షణ ఇచ్చే బాధ్యతను సీబీఐ తీసుకోవాలని ఈసందర్భంగా కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News