న్యూఢిల్లీ: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సరిహదు్ద భద్రతా బలగం ‘ప్రహరి’ మొబైల్ యాప్‌ను, సరిహద్దు భద్రతా బలగం(బిఎస్‌ఎఫ్) మ్యానువల్‌ను ఢిల్లీలో గురువారం ఆవిష్కరించారు. ప్రహరి యాప్ ద్వారా జవానులు తమ వ్యక్తిగత వివరాలు, వసతి సమాచారం, ఆయుష్మాన్‌సిఎపిఎఫ్, సెలవులు వంటివి తమ మొబైల్‌లోనే చూసుకోవచ్చు.
ఈ మొబైల్ యాప్ జిపిఎఫ్, బయోడేటా, గ్రీవెన్స్ రిడ్రెస్సల్ వంటి వివిధ సమాచారాలు, వివిధ సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవచ్చు. ఈ యాప్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పోర్టల్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా జవానులకు ఉపయోగపడుతుంది. ప్రోయాక్టివ్ గవర్నెన్స్‌కు బిఎస్‌ఎఫ్ ప్రహరి యాప్ ఓ గొప్ప ఉదాహరణ. ఈ యాప్ ఆవిష్కరణ కార్యక్రమానికి కేంద్ర హోమ్ వ్యవహారాల సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్, కేంద్ర హోమ్ కార్యదర్శి, బిఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులు, ఇంకా ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.