Tuesday, April 1, 2025

పార్లమెంట్ వాళ్ల పార్టీలా కాదు.. : రాహుల్‌పై షా సెటైర్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సెటైర్లు వేశారు. పార్లమెంట్‌లో తనుక మాట్లాడే అవకాశం ఇవ్వలేదని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. పార్లమెంట్ వాళ్ల పార్టీ(కాంగ్రెస్)లా కాదని.. షా పేర్కొన్నారు. ‘టైమ్స్ నౌ సమ్మిట్‌ 2025’లో షా మాట్లాడుతూ.. ‘సభలను ఇష్టానుసారం నడపలేము.. సభలో మాట్లాడటానికి నియమాలు ఉన్నాయనే సంగతి ప్రతిపక్ష నేతకు తెలియకపోవచ్చు. బడ్జెట్ చర్చలో 42 శాతం సమయం ఆయనకే ఇస్తే.. ఆయన మాత్రం వియత్నాంలో ఉన్నారు. పార్లమెంట్ అన్నది వాళ్ల పార్టీలా కాదు.. నియమాలకు అనుగుణంగా నడుస్తోంది. ప్రతీ ఒక్కరు నియమాలు, నిబంధనలు పాటించాలి’ అని షా అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News