Tuesday, November 5, 2024

పంజాబ్‌లో కూటమి కోసం అమరీందర్, ధిండ్సాతో బిజెపి చర్చలు: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

యూపీలో బిజెపి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది!
కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేశాక శాంతి, ప్రగతి కనిపిస్తున్నాయి

Amit shah meet with Amarinder singh

 

న్యూఢిల్లీ: పంజాబ్‌లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, శిరోమణి అకాలీదళ్ మాజీ నాయకుడు సుఖ్‌దేవ్ సింగ్ ధిండ్సాతో కూటమి ఏర్పాటు విషయమై బిజెపి చర్చలు జరుపుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం తెలిపారు. ‘హెచ్‌టి లీడర్‌షిప్ సమ్మిట్ 2021’లో కీలకోపన్యాసం అనంతరం ఆయన మాటామంతీ జరిపారు. పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో రైతుల ఆందోళన ప్రభావం చూపగలదన్న అంశాన్ని ఆయన తోసిపుచ్చారు. సేద్యపు చట్టాలను ఉపసంహరించుకున్నాక ఇక సమస్య అన్నదే లేదని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
“మేము కెప్టెన్ సాబ్(అమరీందర్ సింగ్)తో, అలాగే అకాలీదళ్ మాజీ నాయకుడు సుఖ్‌దేశ్ సింగ్ ధిండ్సాతో చర్చలు జరుపుతున్నాం. వారి రెండు పార్టీలతో మేము కూటమి ఏర్పరచే వీలుంది. ఓ పాజిటివ్ మైండ్‌తో ఆ రెండు పార్టీలతో మేము చర్చలు జరుపుతున్నాం” అని అమిత్ షా తెలిపారు. కేంద్ర మంత్రి, సంస్థాగత ఇన్‌ఛార్జి ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నదని కూడా ఆయన తెలిపారు. “నేను ఉత్తర్‌ప్రదేశ్ వెళ్లాను. బిజెపి మెజారిటీతో గెలిచి ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని నా నమ్మకం” అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News