Sunday, December 22, 2024

ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌తో అమిత్ షా తేనేటి విందు రద్దు..!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన పర్యటనలో కీలక మార్పులు చోటు చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆస్కార్ సాధించిన ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌తో అమిత్ షా తేనేటీ విందు కార్యక్రమం రద్దయ్యింది. అలాగే బిజెపి నేతలతో ఆయన భేటీ కూడా రద్దయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇతర కార్యక్రమాలు వుండటంతో ఆదివారం మధ్యాహ్నం తర్వాత అమిత్ షా శంషాబాద్ విమానాశ్రయానికి రానున్నారు. అక్కడి నుంచి నేరుగా చేవేళ్లలో బిజెపి బహిరంగ సభ జరిగే కార్యక్రమానికి అమిత్ షా చేరుకోనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

ఇకపోతే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అమిత్‌షా ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్ హోటల్‌కు చేరుకుని 4 నుంచి 4.30 గంటల వరకు ఆర్‌ఆర్‌ఆర్ టీమ్‌తో జరిగే తేనేటీ విందులో పాల్గొంటారు. 4.30 నుంచి 5.10 గంటల వరకు బిజెపి రాష్ట్ర ముఖ్య నేతలతో సమావేశమవుతారు. సాయంత్రం 6 గంటలకు చేవేళ్ల సభకు చేరుకుని 7 గంటల వరకు అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం 7.45కి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, 7.50కి ఢిల్లీ బయల్దేరి వెళతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News