Thursday, January 23, 2025

అమిత్ షా అధ్యక్షతన తెలంగాణ బిజెపి నేతల భేటీ

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నివాసంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్రానికి చెందిన బిజెపి నాయకుల సమావేశం మంగళవారం ప్రారంభమైంది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్, నాయకురాలు డికె అరుణ, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పార్టీని ప్రజలకు చేరువ చేసేందుకు ప్రజా గోశ..బిజెపి భరోసా, ప్రజా సగ్రామ యాత్ర వంటి అనేక కార్యక్రమాలను బిజెపి రాష్ట్ర విభాగం చేపట్టింది. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి మూడవ వారంలో బండి సంజయ్ పదవీకాలం ముగియనుండడంతో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నిక త్వరలో జరగనున్నట్లు వర్గాలు తెలిపాయి. అయితే..బండి సంజయ్‌ను మరో పర్యాయం పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగించే అవకాశం ఉందని, ఈ సమావేశంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News