Tuesday, January 21, 2025

ఆ మూడు పార్టీల జెండాలు వేరైనా.. అజెండా ఒక్కటే: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

అయోధ్యలో రామమందిరాన్ని పూర్తి చేసి ప్రజల కల సాకారం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మోడీని  మూడోసారి ప్రధానిని చేయాలని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ లో బిజెపి సోషల్ మీడియా ఇన్ ఛార్జిలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లోనూ బిజెపిదే విజయమన్నారు.

అతి త్వరలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వస్తుందని‌.. సోషల్ మీడియా ద్వారా ప్రతి ఇంటికి బిజెపి వెళ్లాలన్నారు. బిఆర్ఎస్‌, కాంగ్రెస్‌ నేతలపై రూ.వేల కోట్లలో అవినీతి ఆరోపణలు ఉన్నాయని.. కానీ, ప్రధాని మోడీపై ఎలాంటి అవినీతి మరకలు లేవని చెప్పారు. బిఆర్ఎస్, కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీల జెండాలు వేరు..కాని, అజెండా ఒక్కటేనని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News