Monday, December 23, 2024

వైష్ణవి దేవి మందిరాన్ని దర్శించుకున్న అమిత్ షా

- Advertisement -
- Advertisement -

Amit Shah at VaishnaviDevi Mandir

జమ్ము: కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం ఉదయం కత్రాలోని మాతా వైష్ణవి దేవి మందిరాన్ని సందర్శించుకుని పూజలు చేశారు. ఆయన అక్కడి సాంఝిచత్త్ హెలిపాడ్‌కు చేరుకున్నప్పుడు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆయన వెంట ఉన్నారు. కేంద్ర హోం మంత్రిగా నియుక్తులయ్యాక వైష్ణవి దేవి మందిరానికి అమిత్ షా రావడం ఇదే తొలిసారి. నవరాత్రి వేడుకల తొమ్మిదవ రోజున ఆయన ఈ ఆలయాన్ని దర్శించుకోవడం యాదృచ్ఛికం.

వైష్ణో దేవి ఆలయానికి దాదాపు గంటన్నర దూరంలో ఉన్న రాజౌరిలో జరిగే బహిరంగ సభలో షా ప్రసంగించనున్నారు. మంత్రి జమ్మూలోని కన్వెన్షన్ సెంటర్‌లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు;  వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం షా రాజౌరిలో బహిరంగ సభ నిర్వహించి, జమ్మూలోని రఘునాథ్ ఆలయంలో ప్రార్థనలు చేస్తారు. అంతేకాక సాయంత్రం  ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిస్థితికి సంబంధించిన సమావేశాలతో సహా అనేక కీలకమైన సమావేశాలను హోంమంత్రి నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News