Wednesday, January 22, 2025

ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ముస్లిం రిజర్వేష న్లు రాజ్యాంగ వ్యతిరేకమని కేంద్ర హోంమంత్రి అ మిత్ షా పేర్కొన్నారు. తాము అధికారంలోకి రా గానే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఆ కోటాను ఎస్‌సి, ఎస్‌టి, ఓబిసి రిజర్వేషన్లు పెంచుతామని అన్నారు. అసలు ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించి న ఎన్నికల ప్రచార బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఓటు భాగస్వామ్యం బాగా పెరిగిందని అన్నారు. పది స్థానాలకుపైగానే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. తన వీడియోను మార్ఫింగ్ చేసి రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ అడ్డదారిలో గెలవాలని భావిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ చేసే కుట్రలు సాగనివ్వమని హెచ్చరించారు. కేంద్రంలో మరోసారి మోడి ప్రభుత్వం రావడం ఖాయమని అన్నారు. పండుగలను కూడా సైనికులతో కలిసి గడిపిన మోడీ కావాలో, సెలవుల్లో బ్యాంకాక్ టూర్‌కి వెళ్లిన రాహుల్ బాబా కావాలో ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. తెలంగాణను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎటిఎంగా మార్చుకున్నారని ఆరోపించారు.

రాష్ట్రం నుంచి ఢిల్లీకి ఆర్‌ఆర్ ట్యాక్స్ రూపంలో పెద్ద ఎత్తున నగదు వెళుతోందని అమిత్‌షా ఆరోపించారు. విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలంటే బిజెపితోనే సాధ్యమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించాలా..? వద్దా..? అని ప్రజలను అడిగారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో చేసిందని అన్నారు. రైల్వేలో గణనీయమైన అభివృద్ధిని సాధించామని, నాలుగు వందే భారత్ రైళ్లు తెలంగాణ నుంచే నడుస్తున్నాయని అన్నారు. రైల్వేలో భవిష్యత్తులో మరింత పురోగతి వస్తుందని అన్నారు. కశ్మీర్‌లో భారత్ జెండ సగర్వంగా ఎగురుతుందంటే అది మోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయమని అన్నారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల స్థావరం వద్దకు వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేశామని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News