Friday, April 4, 2025

పేద ముస్లింల కోసమే వక్ఫ్ బిల్లు

- Advertisement -
- Advertisement -

వక్ఫ్‌బోర్డులోని అవినీతి అంతమే లక్షం ఆస్తుల
సక్రమ వినియోగం కోసమే బిల్లును తీసుకొస్తున్నాం
ఇది అతిపెద్ద సంస్కరణ ఈ బిల్లు రాజ్యాంగబద్ధమే
దీనిపై ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయి
బిల్లుకు మెజారిటీ వర్గాల మద్దతు : అమిత్

న్యూఢిల్లీ : వక్ఫ్ సవరణ బిల్లు బోర్డ్ లలో అవినీతిని నిర్మూలించేందుకు ఉద్దేశించినదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. బిల్లుపై చర్చలో పాల్గొ న్న హోం మంత్రి ఎన్డీయే పార్టీ లు వోట్ బ్యాంక్ కోసం ఏ ఒక్క చట్టాన్ని చేయబోవని ఉద్ఘాటించారు. వోట్ బ్యాంక్ రాజకీయా ల్లో భాగంగానే ముఖ్యంగా ము స్లిం కమ్యునిటీలో భయాందోళనలకు కల్గించేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, వక్ఫ్ బిల్లు ముస్లీంలకు వ్యతిరేకం కాదని, బిల్లు అమలు వల్ల ఏ ముస్లిం ఆస్తికి కానీ, హ క్కులకు కానీ  భంగం వాటిల్లబోదని హోం మంత్రి హామీ ఇచ్చారు.

సంయుక్త పార్లమెంటరీ కమిటీ విసృ్తతంగా చర్చించి బిల్లులో పలు సిఫార్సులు చేసిందని, బిల్లు వక్ఫ్ ఆస్తులను సాంకేతికత ఆధారంగా సమర్థంగా నిర్వహిస్తుందని, చట్టపరమైన అడ్డంకులను తొలగించి, పారదర్శికత పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిందని హోంమంత్రి స్పష్టం చేశారు. 1913-2013 మధ్య వక్ఫ్ బోల్డ్ కింద కేవలం 18 లక్షల ఎకరాల భూమి మాత్రమే ఉందని, 2013-2025 మధ్య అదనంగా మరో 21 లక్షల ఎకరాల భూమిని చేర్చారని, ఆది దుర్వినియోగం అవుతోందని ప్రతిపక్షాలే చెబుతున్నాయని ఆయన అన్నారు. వక్ఫ్ బోర్డ్ లో ముస్లీమేతరులన్న ప్రశ్నకు చట్టప్రకారం ఎవరైనా విరాళంగా ఇచ్చిన ఆస్తి నిర్వహణను మాత్రమే ముస్లీమేతర సభ్యులు చూసుకుంటారని మంత్రి స్పష్టం చేశారు. వక్ఫ్ మతపరమైన వ్యవహారాల నిర్వహణలో ముస్లిమేతరులు జోక్యం చేసుకోబోహని ఆయన స్పష్టం చేశారు. అలాగే బిల్లువల్ల ముస్లీంల మతపరమైన కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలుగబోదని హోం మంత్రి భరోసా ఇచ్చారు. బిల్లుపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ, తప్పుడు ఊహాగానాలను వ్యాప్తి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముస్లిమేతరులను బోర్డ్ లు చేర్చడం ద్వారా వక్ఫ్ విషయాలలో జోక్యం చేసుకుంటున్నారన్న వాదనను అమిత్ షా తిప్పికొట్టారు. ఇవి నిరాధారమైన ఆరోపణలన్నారు. బిల్లు వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని అరికట్టడమే లక్ష్యంగా తీసుకువచ్చినట్లు పునరుద్ఘాటించారు.

ముస్లీమేతర సభ్యులు వక్ఫ్ బోర్డ్ నిర్వహణ చట్టపరంగా సాగుతోందా లేదా, విరాళాలు ఇస్లాం మతంకోసం, పేదల అభివృద్ధికోసం వినియోగిస్తున్నారా లేదా అన్న విషయాలనే పర్యవేక్షిస్తారని అమిత్ షా వివరించారు.వక్ఫ్ బోర్డు, వక్ఫ్ కౌన్సిల్ ఆస్తులను అక్రమంగా అమ్మేవారిని పట్టుకుని చట్టానికి అప్పగిస్తాయన్నారు. కాంగ్రెస్ కేవలం ముస్లి ఓట్ బ్యాంక్ కోసం 2014 ఎన్నికలకు ముందు2013 లో రాత్రికి రాత్రి దాదాపు 125 వీవీఐపీ ఆస్తులను వక్ఫ్ కు అప్పగించిందని అమిత్ షా విమర్శించారు. 2013లో వక్ఫ్ చట్టాన్ని సవరించకుండా ఉంటే, ఈ సవరణ బిల్లు అవసరం ఉండేది కాదని అమిత్ షా వివరించారు. వక్ఫ్ బిల్లును గతంనుంచి అమలులోకి వస్తుందనే అపోహ ను ప్రచారం చేస్తున్నారని, ఆ అపోహ వద్దని, బిల్లును పార్లమెంటు ఆమోదించిన తర్వాత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాతే అమలు లోకి వస్తుందని హోంమంత్రి స్పష్టం చేశారు. గతంలోని అంశాలకూ దీనిని వర్తింపజేసే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. 2013లో వక్ఫ్ కు సవరణలు ప్రవేశపెట్టినప్పుడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ కఠినమైన వక్ఫ్ చట్టాన్ని కోరుకుంటున్నానని చెప్పారని, మోదీ లాలూ యాదవ్ కలను నెరవేరుస్తున్నారని అమిత్ షా నవ్వుతూ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News