Wednesday, January 22, 2025

అంజలి ఉదంతంపై తక్షణ దర్యాప్తుకు అమిత్ షా ఆదేశాలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో యువతి అంజలి విషాదాంతంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు జరిపించి తనకు నిజనిర్థారణ నివేదికను సాధ్యమైనంత త్వరగా అందించాలని ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరాను సోమవారం ఆదేశించారు. స్కూటీని ఓ కారు ఢీకొని ఈడ్చుకుని వెళ్లిన ఘటనలో 20 సంవత్సరాల అంజలి సింగ్ కంజావాలా ప్రాంతంలో మృతి చెందింది.ఈ ఘటనపై పలు అనుమానాలు తలెత్తాయి. ఘటనపై దర్యాప్తునకు వెంటనే ప్రత్యేక సిపి షాలీని సింగ్ సారధ్యంలో ఓ బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపించాలని అమిత్ షా ఆదేశించారు.

యువతి భౌతికకాయానికి పోస్టుమార్టం జరిగి నివేదిక వెలువడితే మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఈ ఘటనలో యువతి కారు కిందపడిన తరువాత సుల్తాన్‌పురి నుంచి కంజావాలా వరకూ ఈడ్చుకుంటూ కారు వెళ్లింది. నిందితులలో ఒకరు స్థానిక బిజెపి నేత అని వెల్లడైంది. ఈవెంట్ ఆర్గనైజర్ అయిన అంజలి తన విధులను పూర్తిచేసుకుని స్కూటీపై వస్తుండగా ఐదుగురు వ్యక్తులతో ఉన్న కారు ఢీకొంది. ఈ ఘటనపై ఢిల్లీలో పలు చోట్ల సోమవారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. దోషులను శిక్షించాలని ఉద్యమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News