Wednesday, January 22, 2025

సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించిన అమిత్ షా

- Advertisement -
- Advertisement -

Amit Shah pays tribute to Sardar Vallabhbhai Patel

హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విమోచన దినోత్సవం సందర్భంగా మంత్రి అమిత్ షా జాతీయ జెండాను ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పించారు. కేంద్రం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్న ముచ్చట తెలిసిందే. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోపాటు బిజెపి నేతలు హాజరయ్యారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్‌లో విలీనం చేసిన ఆపరేషన్ పోలోకు 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News