Friday, November 22, 2024

బాబుకు అమిత్‌షా ఫోన్

- Advertisement -
- Advertisement -

Amit Shah phone call to Chandrababu

మనతెలంగాణ/హైదరాబాద్:  ఎపి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుధవారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు ఎపి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను అమిత్ షాకు వివరించారు. అంతేకాకుండా ఎపిలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం నడుస్తోందని అమిత్ షాకు తెలిపారు. ఇటీవల ఎపిలో టిడిపి కార్యాలయంపై దాడి ఘటనతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయాలు భగ్గమన్నాయి. ఈ ఘటనపై నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు 36గంటల దీక్ష కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు రాష్ట్ర పరిణామాలను వివరించేందుకు ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీకి వెళ్లిన ఆయన సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కలిసి ఏపీలో జరుగుతున్న పరిస్థితులను వివరించారు. టీడీపీ కార్యాలయంపై దాడితో పాటు రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ విషయంపై కూడా రాష్ట్రపతికి వెల్లడించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేయడంతో ఆయన కశ్మీర్ పర్యటనలో ఉండటంతో ఫోన్ చేసి ఎపి రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News