Wednesday, January 22, 2025

ఖర్గే, రాహుల్ గాంధీ అందుకే ఆయోధ్యకు రాలేదు: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

ఆసిఫాబాద్: లోక్ సభ ఎన్నికల తొలి రెండు విడుతల్లో బిజెపి సెంచరీ కొడుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో భారతీయ జనతా పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ సారి బిజెపి పది లోక్ సభ సీట్లలో విజయం సాధిస్తోందన్నారు. స్వాతంత్ర్య వీరులు రాంజీగోండ్, కుమురం భీం, కొండా లక్ష్మణ్ బాపూజీలకు ప్రణామలు చేశారు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో రెండు విడతల పోలింగ్ ముగిసిందన్నారు. తెలంగాణలో కొన్నాళ్లుగా బిజెపి ఓట్ల శాతం పెరుగుతోందని ఆయన తెలిపారు.

ఈ సారి తెలంగాణలో బిజెపి పది లోక్ సభ సీట్లలో విజయం సాధిస్తోందన్న అమిత్ షా.. కేంద్రంలో మరోసారి మోడీ సర్కార్ వస్తోందని తెలిపారు. దేశంలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఓవైపు మోడీ.. మరోవైపు రాహుల్ బాబా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. పండుగలను కూడా సైనికుల మధ్య జరుపుకేనే మోడీ ఓ వైపు.. సెలవుల కోసం బ్యాంకాంక్ టూర్లు వేసే రాహుల్ బాబా ఓ వైపు ఉన్నారని అమిత్ షా ఎద్దేవా చేశారు. తాను ఎక్కడికి వెళ్లినా.. మోడీ.. మోడీ అనే నినాదాలే వినిపిస్తున్నాయన్నారు. 70 ఏళ్లుగా అయోధ్య రామమందిరం నిర్మాణం జరగకుండా కాంగ్రెస్ అడ్డుకుందని ఆరోపించారు. రెండోసారి ప్రధానిగా నరేంద్రమోడీ వచ్చాకే రామమందిర ప్రతిష్ఠ జరిగిందని స్పష్టం చేశారు.మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఇద్దరినీ రామమందిర ప్రతిష్ఠకు ఆహ్వానించామని అమిత్ షా గుర్తుచేశారు. తమ ఓటు బ్యాంకు పోతుందని ఖర్గే, రాహుల్ గాంధీ అయోధ్యకు రాలేదని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News