Sunday, January 19, 2025

డ్రగ్స్ విక్రేతల ఆస్తులు జప్తు చేయండి : అమిత్‌షా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మాదక ద్రవ్యాల వ్యాపారం చేసే వ్యక్తుల ఆస్తులను జప్తు చేయాలని, వారిని సమాజం నుంచి బహిష్కరించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, జాతీయ భద్రతపై నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశం లోని వివిధ ప్రాంతాల్లో 1.40 లక్షల కిలోల మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసే కార్యక్రమాన్ని ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షించారు. వాటి విలువ రూ. 2378 కోట్లు ఉంటుందని అంచనా. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ దేశంలో ఏ యువకుడు డ్రగ్స్‌కు బానిస కాకూడదనే లక్షంతో మోడీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వ్యాపారం చేసేవారిపై విధించే కఠిన శిక్షలు సమాజం లోకి బలమైన సందేశాన్ని తీసుకెళ్తాయని , అవి బలమైన నిరోధకంగా కూడా పనిచేస్తాయని అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ విక్రేతల ఆస్తులను జప్తు చేసే చర్యల్ని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రగ్స్ వాడే వారిని బాధితులుగా చూడాలని, విక్రేతలను మాత్రమే నేరస్థులుగా పరిగణించాలని అధికారులకు సూచించారు. గత ఏడాది కాలంలో రూ. 12 వేల కోట్ల విలువైన 10 లక్షల కిలోల మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసినట్టు మంత్రి వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News