Wednesday, January 22, 2025

రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ

- Advertisement -
- Advertisement -

గవర్నర్ సారథ్యంలో శాంతి కమిటీ
డిజిపిపై బదిలీ వేటు వేసిన ప్రభుత్వం
మూడు రోజుల మణిపూర్ పర్యటనలో హోంమంత్రి అమిత్ షా
ఇంఫాల్ : మణిపూర్ హింసాకాండ సమస్య పరిష్కారానికి కేంద్రం చర్యలు తీసుకుంటుందని హోం మంత్రి అమిత్ షా గురువారం తెలిపారు. హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్‌తో న్యాయవిచారణకు త్వరలోనే ఆదేశాలు వెలువరిస్తామని వెల్లడించారు. దీనితో పాటు వివిధ వర్గాల మధ్య సామరస్యసాధనకు శాంతి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆందోళనకరంగా మారిన మణిపూర్ పరిస్థితిని సమీక్షించేందుకు హోం మంత్రి అమిత్ షా ఇక్కడ మూడు రోజుల పర్యటనకు వచ్చారు. సమగ్రరీతిలో ఉండే శాంతి కమిటీకి రా ష్ట్ర గవర్నరర్ అనుసూయియా ఉయికె సారధ్యం వహిస్తారు. కమిటీలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, కుకీ, మైతీ తెగల నేతలు, సామాజిక సం స్థలు చోటుచేసుకుంటాయని అమిత్ తెలిపారు. ఇప్పటి డిజిపిని మార్చివేసినట్లు చెప్పారు. పరిస్థితిని తాను పలు స్థాయిల్లో నిశితంగా సమీక్షించినట్లు వివరించారు. మణిపూర్‌లో ప్రస్తుత సంక్షోభానికి విరుగుడు కేవలం వివిధ వర్గాల మధ్య సంప్రదింపుల ప్రక్రియనే స్పష్టం చేశారు. త్వరితగతిన సాధారణ పరిస్థితుల నెలకొనాల్సి ఉంది. ఈ దిశలో జుడిషియల్ దర్యాప్తు ప్రకటన త్వరలో వెలువరిస్తామన్నారు. ఏ వర్గం అయినా తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలను వెంటనే సరెండర్ చేయాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని అమిత్ షా హెచ్చరించారు.

కుట్రకోణాల కేసులపై సిబిఐ ఆరా
మణిపూర్‌లో జరిగింది కేవలం తెగల మధ్య వైరం కాదని, దీని వెనుక పలు ఇతర కారణాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. జరిగిన హింసాత్మ క ఘటనల తీవ్రత, సాగించిన హింసాకాండ తీరుతెన్నులను బట్టి చూస్తే ఇది కేవలం వర్గఘర్షణ కాదని నిర్థారణ అవుతోంది. ఐదు కుట్రకోణాలు, ఒక్క సాధారణ కుట్ర ప్రయత్నం దిశలో దాఖలు అయిన కేసులపై సిబిఐ దర్యాప్తు కూడా జరుగుతుందని మంత్రి తెలిపారు. దీనివల్ల పూర్తిస్థాయి లో ఘటనలపై నిజాలు ఆవిష్కరణకు వస్తాయని చెప్పారు. ఇప్పటి పరిస్థితి తాత్కాలికం, అపార్థాలు అపోహలు తొలిగిపోతాయి. త్వరలోనే శాంతిసామరస్యాలు నెలకొంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాను పలు ప్రాంతాలలో సహాయ క శిబిరాలను సందర్శించానని, కుకీ, మైతీ సామాజిక బృందాలను కలిసినట్లు, శాంతి ప్రక్రియపై చర్చించినట్లు వివరించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రతినిధులు తనను కలిసినప్పుడు శాంతి సామరస్య స్థాపనకు అన్ని విధాలుగా సహకరిస్తామని, మణిపూర్ శాంతియుత వాతావరణం అత్యవసరం అని చెప్పారని హోం మంత్రి వివరించారు.

భద్రతా ఏర్పాట్లకు సమన్వయంగా ఏకీకృత దళం
ఇప్పుడు రాష్ట్రంలో పలు భద్రతా బలగాలు శాంతిభద్రతల పరిరక్షణకు పనిచేస్తున్నాయి. వీరి మధ్య సరైన సమన్వయం అత్యవసరం. ఈ దిశలో ఇం టర్ ఏజెన్సీ యునిఫైడ్ కమాండ్ ఏర్పాటు జరుగుతుందని మంత్రి తెలిపారు. ఇప్పుడు దాదాపు 10వేల మంది సైన్యం, అస్సాం రైఫిల్స్ సిబ్బంది శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడుతోంది. కేం ద్రీయ బలగాలు, రాష్ట్ర పోలీసులు ఎక్కడికక్కడ క్షే త్రస్థాయిలో విధి నిర్వహణలో ఉన్నాయి. ఇప్పుడు ఏర్పాటు అయ్యే యునిఫైడ్ కమాండ్ ఏర్పాటు వల్ల వివిధ దళాల మధ్య సమన్వయ సాధనకు వీలేర్పడుతుంది. మణిపూర్‌లో తరచూ జరుగుతున్న ఘర్షణలకు మూలాలు ఎక్కువగా ఇండో మయన్మార్ సరిహద్దు సమస్యతో ముడివడి ఉన్నాయని అమిత్ షా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News