Sunday, January 19, 2025

కర్నాటక ప్రచారంలో అమిత్ షా అసహనం.. బిజెపి నేతలపై సీరియస్

- Advertisement -
- Advertisement -

ఏమిటప్పా ఈ తంతు?
కర్నాటక ప్రచారంలో అమిత్ షా అసహనం
జనం ఏరీ అన్ని బైక్‌లే కన్పిస్తున్నాయి
ఇదేం తీరు అని బిజెపి నేతలపై విసుర్లు
బెళగావి సభలో కొట్టొచ్చిన నిరాశ
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హోం మంత్రి అమిత్ షా బెళగావిలో ఆదివారం రోడ్ షో జరిపారు. ఆదివారమే ప్రధాని మోడీ బెంగళూరులో రోడ్‌షోకు దిగారు. దీనిపై మోడీ ఆనందం వ్యక్తం చేశారు. బాగా జరిగిందన్నారు. అయితే బెళగావిలోరోడ్ షోకు హాజరైన పల్చనైన ప్రజలను చూసి అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేశారు. పక్కన ఉన్న బిజెపి నేతలపై సీరియస్ అయ్యారు. తనకు బైక్‌లు బాగా కన్పిస్తున్నాయని జనాలే పల్చగా ఉన్నారని అన్నారు. ఆయన నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని కొందరు సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.

సాధారణంగా అమిత్ షా కీలకమైన నేర్పరి అయిన ఎన్నికల వ్యూహకర్త అనే పేరు తెచ్చుకున్నారు. అయితే కర్నాటకలో ఓటర్ల నాడి గురించి ఆయన పసికట్టలేకపోతున్నారని బిజెపి సీనియర్ నేతలే వ్యాఖ్యానించారు. ఇక ప్రచారం ఒక్కరోజులో ముగుస్తుందనగా అమిత్ షా బిజెపి శ్రేణులపై విరుచుకుపడటం , ఇదేనా జనాలను తరలించడం అని కసురుకోవడం పార్టీ వర్గాల్లో గందరగోళానికి దారితీశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News