Monday, December 23, 2024

హైద‌రాబాద్‌లో అమిత్ షా స‌భ అట్ట‌ర్ ఫ్లాప్

- Advertisement -
- Advertisement -

Amit Shah Sabha in Hyderabad is an utter flop

హైద‌రాబాద్‌: హైద‌రాబాద్‌లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, టూరిజం శాఖ మంత్రి కిష‌న్ రెడ్డిల‌తో బిజెపి నిర్వ‌హించిన తెలంగాణ విమోచ‌న దినోత్స‌వం అట్ట‌ర్ ఫ్లాప్ గా ముగిసింద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. జ‌నం లేక వెల వెల పోయింద‌న్నారు. అలాగే నాడు స‌మైక్య‌త కోసం జాతీయ నాయ‌కులు ప‌ని చేస్తే, నేడు బిజెపి విచ్చిన్నం కోజం ప‌ని చేస్తున్న‌ద‌న్నారు. తెలంగాణ సాయుధ పోరాటంతో, స్వాతంత్య్ర ఉద్య‌మంతో క‌నీస సంబంధం లేని పార్టీ పెట్టే స‌మావేశాల‌ను, పార్టీల‌ను తెలంగాణ ప్ర‌జ‌లు న‌మ్మ‌డానికి సిద్ధంగా లేర‌న్నారు. ఇదే విష‌యం మ‌రోసారి రుజువైంద‌న్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌పై క‌ప‌ట ప్రేమ‌ను ఒల‌క‌బోసే బిజెపి, మ‌రి తెలంగాణ‌కు నిధులు ఎందుకు ఇవ్వ‌డం లేద‌ని ఎర్ర‌బెల్లి ప్ర‌శ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News