Saturday, April 19, 2025

2026 నాటికి నక్సలిజం ఇక చరిత్రే : అమిత్‌షా

- Advertisement -
- Advertisement -

నక్సలైట్లు కేవలం నాలుగు జిల్లాలకే పరిమితమై ఉన్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31 వ తేదీ వరకు నక్సల్స్ అంతం అవుతారని ఆయన పేర్కొన్నారు. నక్సల్స్‌ను రూపు మాపడంలో సీఆర్పీఎఫ్ వెన్నుముకగా నిలిచినట్టు ఆయన చెప్పారు. మధ్య ప్రదేశ్ లోని నీముచ్ జిల్లాలో గురువారం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన రైజింగ్‌డే ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం నుంచి నక్సలైట్లను ఏరివేయడంలో సీఎపీఎఫ్ తోపాటు సీఆర్పీఎఫ్‌కు చెందిన కోబ్రా బెటాలియన్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ ( కోబ్రా) యూనిట్, భద్రతా దళాల్లో ప్రత్యేకంగా పనిచేస్తున్నంది. గెరిల్లా, జంగిల్ యుద్ధాల్లో ఆ దళం ఆరితేరి ఉందని, నక్సల్స్‌ను ఎదుర్కోవడంలో కోబ్రా దళం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తోందన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సుమారు 400 ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్‌లను ఏర్పాటు చేసినట్టు షా వెల్లడించారు.

దీనివల్లే ఈ ప్రాంతాల్లో హింస తగ్గిందన్నారు. సుమారు 70 శాతం హింస తగ్గినట్టు చెప్పారు. ఇప్పుడు చివరిదశకు చేరుకున్నట్టు చెప్పారు. దేశ భద్రత కోసం సీఆర్పీబఫ్ చేసిన సేవలు అసాధారణమైనవని పేర్కొన్నారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడటం లోనైనా, ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొల్పాలన్నా, నక్సలైట్లను ఎదుర్కోవాలన్నా, సీఆర్పీఎఫ్ చేస్తున్న పోరాటం అసామాన్యమైందన్నారు. ప్రతి అచీవ్‌మెంట్‌లో సీఆర్పీఎఫ్ జవాన్ల పాత్ర కీలకంగా ఉన్నట్టు చెప్పారు. వాస్తవానికి ప్రతి ఏడాది మార్చి 19న సీఆర్పీఎఫ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1950 లో ఈ రోజునే కేంద్ర హోం మంత్రి వల్లభాయ్ పటేల్ జెండాను దళానికి అందజేశారు. అయితే ఈ ఏడాది సంబరాలను పొడిగించిన నేపథ్యంలో ఏప్రిల్ 17న పరేడ్ నిర్వహించారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News