Tuesday, January 7, 2025

అమిత్ షా రాజీనామా చేయాలి: అరవింద్ కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అస్తవ్యస్తమైన శాంతిభద్రతలను పరిరక్షించడం చేతకాకపోతే కేంద్ర హొం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

అంతటా గందరగోళంగా ఉంది,  పెరుగుతున్న నేరాల కారణంగా ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రావడానికి భయపడుతున్నారు.  పితంపుర స్లమ్ క్లస్టర్‌లో తన ఇంటి వెలుపల కత్తితో పొడిచి చంపబడిన యువకుడి బంధువులను కలిసిన తర్వాత కేజ్రీవాల్ ఈ ఆరోపణలు చేశారు. ‘‘ఇద్దరు యువకులపై ఏడెనిమిది మంది స్థానిక యువకులు దాడిచేశారు. మనీశ్ అనే యువకుడిని అనేకమార్లు పొడిచి చంపారు. అతడిని సకాలంలో ఆసుపత్రికి చేర్చకపోవడం వల్ల చనిపోయాడు. హిమాంశు అనే మరో యువకుడిని రక్షించగలిగారు. అయితే సాక్షి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేయలేదు’’ అని కేజ్రీవాల్ తెలిపారు.

‘‘ఒకవేళ అమిత్ షా ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిని పరిరక్షించలేకపోతే, కేవలం దేశంలో రాజకీయ పర్యటనలకే పరిమితమైతే ఆయన రాజీనామా చేయాలి’’ అని మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు.  పోలీసులు బాధితులనే బెదిరిస్తున్నారే తప్ప చర్యలు చేపట్టడం లేదని అన్నారు. దీనిపై ఢిల్లీ పోలీసుల ప్రతిస్పందన కరువయింది. కారణం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ  అదుపు వారిపై ఉందని కేజ్రీవాల్ ఆరోపించారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, గొలుసు దొంగతనాలు, ఇతర నేరాలు ఢిల్లీలో పెరిగిపోతున్నాయని, తనకు అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని, తమ ప్రాంతానికి వచ్చిపొమ్మని కోరుతున్నారని తెలిపారు. తాను ప్రజల సమస్యలను లేవనెత్తుతానని అన్నారు. ఇదిలావుండగా కేజ్రీవాల్ ఢిల్లీలో పాలిస్తున్న ఆప్ ప్రభుత్వ అవినీతి నుంచి దృష్టి మళ్లించడానికే ఇలా శాంతిభద్రతల అంశాన్ని లేవనెత్తుతున్నారని బిజెపి ఆరోపించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News