డుంర్జులా: బెంగాల్‌లో మమత బెనర్జీ ఇక తోడు ఎవరూ లేని ఒంటరి అవుతారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ పరిస్థితి ఏర్పడుతుందని, ఎందుకైనా మంచిదని మమత మేనల్లుడి సేవలో తరిస్తోందని వ్యాఖ్యానించారు. బిజెపి తరఫున ఇక్కడ ఎన్నికల ప్రచార సభనుద్ధేశించి షా వీడియో కాన్ఫరెన్స్ పద్థతిలో మాట్లాడారు. ఇప్పటికే మమత ధోరణితో విసిగి పార్టీ నుంచి పలువురు వెళ్లారని ఇక త్వరలోనే ఆమె వెంట ఎవరూ మిగిలే ఛాన్స్ లేదన్నారు. మమత పార్టీ చెప్పేదొకటి చేసేదొకటని, వారి నినాదం అయిన తల్లి, భూమి, ప్రజా ఒట్టి బూటకం అని, నిజానికి బెదిరింపులు వసూళ్లు ప్రసన్నం చేసుకోవడాల పద్థతి వారిదని విమర్శించారు. ఈసారి బెంగాల్‌లో బిజెపి ప్రభుత్వం ఖాయం అని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. చాలారోజులుగా బెంగాల్‌లో అధికార పార్టీ నుంచి ప్రముఖ నేతలు ఎక్కువ సంఖ్యలోనే రాజీనామాలకు దిగి బిజెపిలో చేరుతున్నారు. వీరిలో మంత్రులు, ఎమ్మెల్యేలు చివరికి కార్పొరేటర్లు కూడా ఉన్నారు. మోడీ సర్కారు జన హితం కోసం పాటుపడుతోందని, అయితే ఇక్కడ మమత ప్రభుత్వం అల్లుడి సేవలో సాగుతోందని వ్యాఖ్యానించారు. తొందర్లోనే టిఎంసి ఖాళీ అవుతుందని, తమ పార్టీనే బలీయం అవుతుందని షా జోస్యం చెప్పారు.
Amit Shah slams Bengal CM Mamata Banerjee