Monday, December 23, 2024

భూముల వేలంలో కోట్ల అవినీతి జరిగింది: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ భూముల వేలంలో రూ. 4వేల కోట్లు అవినీతి జరిగిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓఆర్ఆర్ లీజు వేలంలోనూ, కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా కుంభకోణం జరిగిందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని అమిత్ షా పేర్కొన్నారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు.. అదీ జరగలేదన్నారు. ఉద్యోగ పరీక్షల పేపర్లు చేసి కుంభకోణానికి పాల్పడ్డారని మండిపడ్డారు. రైతులకు రూ. లక్ష రూణమాఫీ చేస్తామని పూర్తి చేయలేదని తెలిపారు. రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మరిచిపోయారు. హైదరాబాద్ లో 4 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం ఏమైందని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News