Monday, December 23, 2024

అయోధ్య రామాలయానికి బాబ్రీ తాళం వేస్తారు: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

లఖింపూర్(యుపి): ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారాన్ని చేపడితే అయోధ్యలోని రామాలయానికి బాబ్రీ తాళాన్ని వేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. బుధవారం లఖింపూర్ ఖేరీ లోక్‌సభ స్థానం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తరఫున ఇక్కడ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ బిజెపికి 400 సీట్లు దాటితే రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ఆరోపిస్తున్నాయని తెలిపారు. అది జరిగే అవకాశం లేనప్పటికీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మాత్రం అయోధ్య రామాలయానికి బాబ్రీ పేరుతో తాళం పడుతుందని అమిత్ షా ఆరోపించారు.

రామ జన్మభూమికి సంబంధించిన న్యాయ వివాదాన్ని ప్రధాని మోడీ గెలవడంతోపాటు రామాలయానికి భూమి పూజ చేశారని, జనవరిలో ఆలయానికి ప్రాణ ప్రతిష్ట కూడా జరిగిందని ఆయన తెలిపారు. లోక్‌సభ ఎన్నికల మొదటి మూడు దశలు పూర్తయిన తర్వాత మోడీ 180 సీట్లు దాటేశారని, నాలుగవ దశ తర్వాత మోడీ నాయకత్వంలో 400 సీట్లు దాటుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎస్‌బి, బిఎస్‌పి, కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. మే 13న నాలుగవ దశలో లఖింపూర్ ఖేరీలో పోలింగ్ జరగనున్నది. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News