Monday, September 9, 2024

2029లోనూ మాదే అధికారం:అమిత్ షా

- Advertisement -
- Advertisement -

ఇప్పుడే కాదు 2029లో కూడా కేంద్రంలో అధికారం ఎన్‌డిఎదే అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని రాసిపెట్టుకోవాలని, 2029లో కేంద్రంలో ఉండేది బిజెపి సారధ్యపు కూటమి ప్రభుత్వమే అన్నారు. స్థానికంగా మణిమజ్రా నిరంతర నీటి సరఫరా పథకానికి ఆదివారం ఆయన ప్రారంభోత్సవం జరిపారు. ఆ తరువాత విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వ బలం లేదని, ఎప్పుడైనా కేంద్రంలోనిసర్కారు కూలుతుందని ఇండియా కూటమి నేతలు చెప్పడాన్ని అమిత్ షా తిప్పికొట్టారు. ఈ పర్యాయం తుదివరకూ ఉండటమే కాకుండా , తరువాతి ఎన్నికల్లో కూడా తమదే గెలుపు అని అమిత్ షా స్పష్టం చేశారు.

విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకోవచ్చు. అయితే దీనిని తాము పట్టించుకునేది లేదని, కేంద్రంలో తిరిగి నెలకొనేది తమ ప్రభుత్వమే , ప్రధానిగా తిరిగి వచ్చేది మోడీనే అని కేంద్రంలో నెంబరు టూగా చలామణిలో ఉన్న అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు ఈసారి కొద్దిగా ఎక్కువ సీట్లు రాగానే తమకు తాము ఎన్నికల్లో గెలిచామనే భ్రమలో పడ్డారని షా తెలిపారు. మొత్తం ఇండియా కూటమికి దక్కిన సీట్ల కన్నా బిజెపికి ఎక్కువ స్థానాలు వచ్చాయని , దేశంలో అనిశ్చితతను సృష్టించే యత్నాల్లో భాగంగానే ప్రతిపక్షాలు ఈ విధంగా తప్పుడు మాటలకు దిగుతారని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News