Thursday, January 23, 2025

3 నెలల్లో 4 విజయాలు.. మోడీభాయ్ తోనే సాధ్యం: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పొగడ్తల వర్షం కురిపించారు. కేవలం 3 నెలల వ్యవధిలో పార్లమెంట్ నూతన భవనం, చంద్రయాన్ 3, జీ20 సదస్సు, మహిళా రిజర్వేషన్ బిల్లు నాలుగు విజయాలు నమోదు చేశారని కొనియాడారు. ఇంకెవరికైనా అయితే 50 ఏళ్లు పట్టేదని అమిత్ షా అన్నారు. అహ్మదాబాద్‌లో శనివారం నిర్వహించిన సభలో ఈమేరకు ఆయన మాట్లాడారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు ప్రధాని మోడీ పునరుజ్జీవం పోశారని, శాస్త్రవేత్తల్లో స్ఫూర్తి నింపారని అమిత్‌షా కొనియాడారు.

జీ 20 సదస్సు ద్వారా అభివృద్ధి చెందిన , అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు భారత్ ఉంటుందన్న సందేశాన్ని పంపారని చెప్పారు. కొత్త పార్లమెంట్ భవనంలో అడుగు పెట్టడమే కాకుండా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపి చరిత్ర లిఖించారని కొనియాడారు. ఇవన్నీ కేవలం మూడు నెలల వ్యవధినే పూర్తి చేశారని, ఇంకెవరికైనా ఇందులో ఒక్కపని పూర్తి చేయాలన్నా 50 ఏళ్లు పడుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News