Sunday, December 22, 2024

బిజెపితోనే సబ్బండ కులాల సంక్షేమం..

- Advertisement -
- Advertisement -

ఆర్మూర్: బిజెపి పార్టీ గెలుపుతోనే సబ్బండ కులాల సంక్షేమం, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిషా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అనేక పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ కరీంనగర్ రోడ్‌లో శుక్రవారం సకలజనుల విజయ సంకల్ప సభ నిర్వహించారు. ఆర్మూర్ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి, బాల్కొండ పార్టీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణలకు మద్దతుగా బిజెపి పార్టీ అభ్యర్థుల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా అమిత్ షా సభకు హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లలో (జీఎస్టీ)ధరలు తగ్గిస్తామమన్నారు.

ఉత్తర తెలంగాణ నుంచి బతుకుదెరువు కోసం బయట దేశం వెళ్లిన వారికి వారి కోసం సంక్షేమ శాఖ మంత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. బీడీ కార్మికుల కోసం జిల్లా కేంద్రంలో 500 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. ఉజ్వల భవిష్యత్తు పథకం ద్వారా ప్రతి పేదింటికి నాలుగు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తామని అమిత్‌షా పేర్కొన్నారు.తెలంగాణ విమోచదినాన్ని రాజ్యాధికారిగా నిర్వహిస్తామని, రైతులు పండించిన ప్రతి వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందని తెలిపారు. డిసెంబర్ 3 తర్వాత వరి ధాన్యం క్వింటాల్‌కు రూ. 3100 ధరతో కడుక్తా లేకుండా కొనుగోలు చేస్తామమన్నారు. పసుపు పండించే రైతుల కోసం పసుపు బోర్డు, రీసర్చ్ సెంటర్‌ను ప్రారంభిస్తామన్నారు. 22 జనవరి 2024లో రామ్ మందిర్ ప్రారంభిస్తున్నామని తెలంగాణ ప్రజలకు ఉచిత దర్శనం అందిస్తామన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట తప్పని మనిషి తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడగానే బీసీ ముఖ్యమంత్రిని నియమిస్తామన్నారు. మోడీ పాలన రక్షణతో దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. అన్ని వర్గాలకు బలం భరోసా అందిస్తున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో మొదటి స్థానం నిలిచే విధంగా పనులు చేస్తామన్నారు. ఆర్మూర్ పైడి రాకేష్ రెడ్డిని, బాల్కొండ అన్నపూర్ణలను కమలం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News