Saturday, January 18, 2025

బీజేపీ గెలిస్తే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గింపు: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

బీజేపీ గెలిస్తే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. తెలంగాణాకు మోడీ సర్కార్ ఇప్పటివరకూ ఏడు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. హుజూరాబాద్ లో జరిగిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ అవినీతి పాలన నుంచి ప్రజలకు విముక్తి కలగాలన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య లోపాయకారీ ఒప్పందం ఉందని, తమ వారసులను పదవుల్లో కూర్చోబెట్టాలని ఆ రెండు పార్టీలూ కంకణం కట్టుకున్నాయని అమిత్ షా ఆరోపించారు. ఒవైసీకి భయపడే బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణా విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదనీ, బీజేపీ అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News