Wednesday, January 22, 2025

బీహార్‌ మరీ బ్యాడ్ అయిపోయింది: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

బీహార్‌లో తిరిగి మేం వస్తాం
కొందరిని తలకిందులుగా వేలాడేస్తాం
రాష్ట్రం మరీ బ్యాడ్ అయిపోయింది
జిల్లా బహిరంగ సభలో కేంద్ర మంత్రి షా
హిసూవా (బీహార్): వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీహార్‌లో బిజెపిదే విజయం అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న మహాఘట్‌ బంధన్‌ను ఓడిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడున్న ప్రభుత్వం బ్యాడ్ ప్రభుత్వం అంటే భ్రష్టాచార్ (అవినీతి) అరాజకత (ఆరాచకం) దమన్ (అణచివేత)లకు ప్రతీకగా మారిందన్నారు. నవాడా జిల్లాలోని హిసూవాలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. వచ్చే ఏడాది తిరిగి లోక్‌సభ ఎన్నికలలో బిజెపి గెలవడం, ప్రధాని మోడీ తిరిగి ప్రధాని కావడం ఖాయం అని, ఆ తరువాత బీహార్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అన్ని జరిగితీరుతాయని తెలిపారు.

అప్పుడు ఈ ఘర్షణకారులందరిని తలకిందులుగా వేలాడదీయడం జరుగుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని నితీశ్‌కుమార్ ప్రభుత్వం మతపరమైన ఉద్రిక్తతకు బాధ్యత వహించాల్సి ఉందన్నారు. ఇప్పుడు ఎక్కడా శాంతి లేని పరిస్థితి ఉందన్నారు. తాను సాసారాంలో పర్యటించాల్సి ఉండగా ఘర్షణల పట్టణాల పరిస్థితితో వీటిని వాయిదా వేసుకోవల్సి వచ్చిందన్నారు. సాసారాంలో ఇప్పుడు జనం వధ, తుపాకుల మోతలు సాగుతున్నాయని కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యానించారు.

కేంద్ర హోం మంత్రిగా తాను ఇక్కడి భయానక స్థితి గురించి రాష్ట్ర గవర్నర్‌తో మాట్లాడినట్లు, అయితే దీనికి జెడియు అధ్యక్షులు లలన్ సింగ్ అభ్యంతరం చెప్పారని, బీహార్‌లో అరాచకం ప్రబలుతూ ఉంటే తాము చూస్తూ కూర్చోవాలా? ఈ విషయం లలన్‌సింగ్‌లు ఇతరులు గుర్తుంచుకుని మాట్లాడాలి. బీహార్ ఈ దేశంలో ఓ రాష్ట్రం, ఇది ఏ ఒక్కరి సొత్తు కాదని షా మండిపడ్డారు. ఇక్కడ అమిత్ షా అరగంట పాటు మాట్లాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News