Monday, December 23, 2024

బీజేపీ గెలిస్తే.. బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం

- Advertisement -
- Advertisement -

ప్రదాని మోడీ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
శుక్రవారం సూర్యాపేట నియోజకవర్గంలో బిజెపి నిర్వహించిన జనగర్జన సభలో అమిత్ షా పాల్గొని మాట్లాడారు.

“తెలంగాణకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేసిందేమీ లేదు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని సోనియా చూస్తుంటే.. కేటీఆర్ ను సిఎం చేయాలని కేసీఆర్ చూస్తున్నారు. వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే బీఆర్ఎస్, కాంగ్రెస్ లక్ష్యం. సోనియా, కేసీఆర్ లకు వాళ్ల కుటుంబం మాత్రమే ముఖ్యం. బీజేపీ ప్రభుత్వం మాత్రమే పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తుంది.

బీసీల సంక్షేమం కోసం ప్రధాని మోడీ.. రాజ్యాంగ బద్ధంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తుంది. గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. సమ్మక్క, సారక్క పేరుతో ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తాం.

బీఆర్ఎస్.. పేదల, దిళితుల వ్యతిరేక పార్టీ. కేసీఆర్ మరోసారి గెలిస్తేనైనా దళితుడిని సిఎం చేస్తారా?. దళితులకు మూడెకరాలు ఇస్తానన్న హామీ ఏమైందో కేసీఆర్ చెప్పాలి. రూ.50వేల కోట్లతో దళితుల అభివృద్ధి నిధి ఏమైందో చెప్పాలి. రూ.10వేల కోట్లతో బీసీల సంక్షేమ కార్యక్రమాలు అన్నారు.. ఏం చేశారో చెప్పాలి” అని అమిత్ షా ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News