Tuesday, January 21, 2025

బిసిని సిఎం చేస్తామని చెప్పిన ఏకైక పార్టీ బిజెపి: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

పదేళ్లలో తెలంగాణను బీఆర్ఎస్ ప్రభుత్వం విధ్యంసం చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఆర్టీసి స్థలాలను కూడా బీఆర్ఎస్ నేతలు వదలడం లేదని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ లో బీజేపీ నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్ షా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “బిసిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన ఏకైక పార్టీ బిజెపే అన్నారు. పెట్రోల్ పై కేంద్రం పన్ను తగ్గిస్తే.. కేసీఆర్ సర్కార్ పట్టించుకోలేదు. కేసీఆర్ హయాంలో అవినీతి రాజ్యమేలులింది. కాళేశ్వరం ప్రాజెక్టు.. కేసీఆర్ కుటుంబానికి ఎటింఎంలా మారింది. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ప్రధాని మోదీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణలో కుటుంబ పాలనను తరిమి కొట్టి.. బీజేపీకి ఓటు వేసి గెలిపించాలి” అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News