Wednesday, November 13, 2024

ఉగ్రవాదులనే అనుమానంతో కాల్పులు జరిపారు: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

కోహిమా: నాగాలాండ్ లో ఆర్మీ కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోమవారం ఈ ఘటనపై అమిత్ షా లోక్ సభలో వివరణ ఇచ్చారు. ”ఉగ్రవాదులనే అనుమానంతో జవాన్లు కాల్పులు జరిపారు. ప్రాథమిక విచారణలో పొరపాటున కాల్పులు జరిపారని తేలింది. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. ప్రశాంత వాతావరణం నెలకోల్పేందుకు కృషి చేస్తాం. ఈ ఘటనపై సిట్ విచారణ జరిపిస్తాం. నెల రోజుల్లో ఘటనపై సమగ్ర దర్యాప్తు పూర్తవుతోంది అని పేర్కొన్నారు. కాగా, ఆదివారం నాగాలాండ్‌లో ఆర్మీ జవాన్లు మిలిటెంట్లుగా భావించి సామాన్య పౌరులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 13మంది పౌరులు చనిపోయారు.

Amit Shah statement on Army firing in Nagaland

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News