Monday, January 20, 2025

రాజ్యాంగబద్ధం .. సుప్రీం ధిక్కారం కాదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అత్యంత వివాదాస్పదం, కీలకమైన ఢిల్లీ సర్వీసెస్ బిల్లును ఎగువ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం సాయంత్రం ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రాజ్యాంగబద్దమని,ఏ విధంగా కూడా సుప్రీంకోర్టు సంబంధిత విషయంపై వెలువరించిన తీర్పునకు భంగకరం కాదని అమిత్ షా తెలిపారు. ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల అధికారాలను కేంద్రం గుప్పిట్లోకి తీసుకువస్తూ కేంద్రం ఇంతకు ముందు తీసుకువచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఇప్పుడు బిల్లు తెచ్చారు. అయితే దీనికి ముందే రాజ్యసభలో ప్రతిపక్షం ఈ ఆర్డినెన్స్ చెల్లనేరదని పేర్కొంటూ దీనికి వ్యతిరేకంగా తీర్మానం తీసుకువచ్చింది. బిల్లు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, దేశ రాజధానిలో పాలన అత్యంత కీలకం. అని ఇక్కడి వ్యవహారాలలో పారదర్శకతకు , అవినీతి రహిత సుపరిపాలనకు దీనిని తీసుకురావడం జరిగిందని సభకు అమిత్ షా తెలిపారు. నేషనల్ క్యాపిటల్ టెరిషియరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లు 202౩కు లోక్‌సభ గత వారం ప్రతిపక్ష ఇండియా కూటమి వాకౌట్ నడుమ ఆమోదం తెలిపింది.

ఇప్పుడు ఈ బిల్లు రాజ్యసభకు వచ్చింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ బిల్లును తీసుకువచ్చినట్లు అమిత్ షా తెలిపారు. ఇప్పుడు దీనిని కాంగ్రెస్ కేవలం రాజకీయాలతోనే వ్యతిరేకిస్తోందని అమిత్ షా తెలిపారు. కాంగ్రెస్ హయాంలో తెచ్చిన బిల్లులో మార్పులు తీసుకువచ్చి ఇప్పుడు కొత్తగా దీనిని తెచ్చినట్లు చెప్పారు. తాను తీసుకువచ్చిన బిల్లునే కాంగ్రెస్ కేవలం ఆప్ ప్రసన్నతకు వ్యతిరేకించడం విడ్డూరంగా ఉందని అమిత్ షా తెలిపారు. కాంగ్రెస్ ఇప్పుడు ఆప్ ఒడిలో పడిందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచినిరసనలు వ్యక్తం అయ్యాయి. అంతకు ముందు ఈ బిల్లుపై ఆప్ నేత రాఘవ ఛద్దా స్పందించారు. ఈ బిల్లు కేవలం రాజకీయ విద్రోహ చర్య అని, రాజ్యాంగ పాపం అని , దేశ రాజధానిలో ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వ అధికారాలను దొడ్డిదారిన కేంద్రం లాక్కునేందుకు చేపట్టిన చర్య అని విమర్శించారు. ఈ బిల్లుపై ఆప్ , కాంగ్రెస్‌లు తమ సభ్యులకు విప్‌లు వెలువరించాయి.

బిల్లు సరైనదే సక్రమమే
సుప్రీం మాజీ సిజెఐ, ఎంపి గగోయ్
రాజ్యసభలో ఇప్పుడు ప్రవేశపెట్టిన ఢిల్లీ సర్వీసెస్ సవరణల బిల్లు సరైనదే అని, ఇందులో అక్రమమేమీ లేదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తెలిపారు. రాజ్యసభ ఎంపి అయిన గగోయ్ సోమవారం రాజ్యసభలో దీనిపై చర్చలో మాట్లాడారు. ఇది కోర్టులో ఉన్న విషయం ఏమీ కాదని, సుప్రీంకోర్టు ముందున్నది కేవలం సంబంధిత ఆర్డినెన్స్ చెల్లుబాటు విషయం అని తెలిపారు. ఇప్పుడు పార్లమెంట్‌లో చట్టం చెల్లుబాటు గురించి చర్చ జరుగుతోందని ఈ న్యాయకోవిదులు తెలిపారు. తాను నామినేటెడ్ సభ్యుడిని అని, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, బిల్లు రాజ్యాంగబద్దత గురించే తాను చెపుతున్నానని స్పష్టం చేశారు. ఈ బిల్లు అవసరం అనవరం గురించి తాను మాట్లాడబోనని, కేవలం దీని చట్టబద్ధతపైనే వాదన విన్పించానని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News