Sunday, December 22, 2024

షిండే ,ఫడ్నవీస్ నివాసాల గణపతి పూజల్లో అమిత్‌షా

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్ నివాసాల్లో శనివారం నిర్వహించిన గణపతి పూజల్లో కేంద్రహోం మంత్రి అమిత్‌షా పాల్గొని ప్రార్థనలు చేశారు. షిండే నివాసం వర్ష, ఫడ్నవీస్ నివాసం సాగర్ లో గణనాధుని పూజలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రమంత్రులు మంగళ్ ప్రభాత్ లోధా,దీపక్ కేసర్కర్ విచ్చేశారు. అమిత్‌షా ఆ తరువాత నగరం లోని లాల్‌బాగ్ చించి పొక్లి ప్రాంతం లోని ప్రఖ్యాత లాల్‌బౌగ్‌చా రాజా పండాల్‌ను సందర్శించి పూజలు చేశారు. కేంద్ర సహకార మంత్రి కూడా అయిన అమిత్‌షా ముంబై యూనివర్శిటీలో నిర్వహించే లక్ష్మణరావు ఇనాందార్ స్మారకోపన్యాసం ఇవ్వడానికి అరుదెంచారు. ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడైన ఇనాందార్ స్థాపించిన సహకార సంస్థ సహకార్ భారతి సమన్వయంతో ఈ స్మారకోపన్యాస కార్యక్రమం ఏర్పాటైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News