Monday, December 23, 2024

రాహుల్ గాంధీ వేసుకున్న టి-షర్ట్ పై అమిత్ షా గగ్గోలు!

- Advertisement -
- Advertisement -

 

Amit Shah

జైపూర్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం ‘భారత్ జోడో యాత్ర’లో రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ వేసుకున్న టి-షర్ట్ విదేశీ తయారీ అంటూ దుమదుమలాడారు. రాజస్థాన్‌లో బిజెపి కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించినప్పుడు రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు దేశం అంతా ఐక్యంగా లేదన్న విషయాన్ని పునరుద్ఘాటించారు. ఇంకా ఆయన ముస్లిం తీవ్రవాదుల కారణంగానే ఉదయ్‌పూర్‌లోని టైలర్ కన్హయ్య హత్యగావించబడ్డాడని అన్నారు. కాంగ్రెస్ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం అన్నారు. ఆయన ఇంకా రాహుల్ గాంధీని లక్షం చేసుకుని ‘ఓయ్ రాహుల్ బాబా, భారత్ ఒక దేశంగా లేదని ఏ పుస్తకంలో చదివావు? పార్లమెంటులో అదేగా నీవు ప్రసంగించావు. ఈ దేశం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారు.” అని చెప్పుకొచ్చారు. “భారత్ ఒక దేశం కాదన్న వ్యక్తి నేడు విదేశీషర్ట్ వేసుకుని దేశాన్ని కలిపే యాత్ర చేస్తున్నారు” వ్యగ్యంగా అన్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ వేసుకున్న టిషర్ట్ రూ. 41,000కు పైగా ఉంటుందని బిజెపి నాయకులు శిగమెత్తిపోతున్నారు. దానికి తోడు ఇప్పుడు అమిత్ షా కూడా అదే పాట పాడుతున్నారు. కాంగ్రెస్ దేశాభివృద్ధికి పనిచేయదని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రం చేయగలదని ఆయన విమర్శించారు. రాజస్థాన్‌లో, ఛత్తీస్‌గఢ్‌లో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇక కాంగ్రెస్ దిక్కులేకుండా పోతుంది అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News