Saturday, December 21, 2024

మునుగోడు ఉప ఎన్నిక: అమిత్ షా టూర్ షెడ్యూల్..

- Advertisement -
- Advertisement -

Amit Shah Telangana Tour Schedule

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో అన్నీ పార్టీలు ప్రచారాలను ప్రారంభించాయి. బహిరంగ సభలను నిర్వహించి ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం మునుగోడులో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బిజెపి అన్ని ఏర్పాట్ల చేసింది. ఈ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాల్గొననున్నారు. దీంతో అమిషా ఈ రోజు తెలంగాణకు రానున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు బేగంపేట విమానాశ్రయంకు అమిత్ షా చేరుకోనున్నారు. 2.30 నిమిషాలకు సికింద్రాబాద్ లోని ఉజ్జాయినీ మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకోనున్నారు. 2.40 నిమిషాల వరకు అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం 2.40 నిమిషాలకు సికింద్రాబాద్ లోని కలాసిగూడలోని సత్యనారాయణ(ఎస్సి) బీజేపీ కార్యకర్త ఇంటికి భోజనానికి వెళ్లనున్నారు. తర్వాత 3.20 నిమిషాలకు బేగంపేట రామ్ దామనోహర హోటల్ కు చేరుకోనున్నారు. 4.10 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుంచి మునుగోడుకు ప్రత్యేక హెలికాప్టర్లో బయల్దేరి వెళ్లనున్నారు. 4.30 నిమిషాలకు మునుగోడుకు చేరుకోనున్నారు. 4.40 నుంచి 4.55 వరకు మునుగోడులో సీఆర్పీఎఫ్ అధికారులతో సమావేశం కానున్నారు. 5.00 గంటలకు అమిత్ షా సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు.ఈ సభ అనంతరం అమిత్ షా రోడ్డు మార్గం ద్వారా 6.50 నిమిషాలకు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళనున్నారు.  30నిమిషాల పాటు రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఉండనున్నారు. 7.20 నిమిషాలకు రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి రోడ్డు మార్గంలో శంషాబాద్ నోవాటెల్ కు బయలుదేరనున్నారు. 7.50నిమిషాలకు నోవాటెల్ హోటల్ కు చేరుకోనున్నారు. తర్వాత రాత్రి 8గంటల నుంచి 9 గంటల వరకు రాష్ట్ర పార్టీ నాయకత్వంతో డిన్నర్ చేస్తూ సమావేశం కానున్నారు. 9.25 నిమిషాలకు అమిత్ షా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఢిల్లీ వెళ్లనున్నారు.

Amit Shah Telangana Tour Schedule

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News