Thursday, December 26, 2024

రెండేళ్లలో నక్సల్స్ ఏరివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇక దేశంలో నక్సల్స్‌ఏరివేత మరింత తీ వ్రస్థాయిలో, ఉధృత రీతిలో సాగుతుందని కేంద్ర హోంమంత్రి అ మిత్ షా ప్రకటించారు. నక్సలైట్లు అత్యంత తీవ్రస్థాయి మా నవ హక్కుల భక్షకులు వారిని సహించేది లేదని, వారి చర్యలను ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. 2026 మార్చి నాటికి దేశంలో సంపూర్ణ స్థాయిలో నక్సలిజం అ నే ది లేకుండా చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు.ఇటీవలి కాలంలో మావోయిస్టులను దెబ్బతీయడంతో భద్రతా బలగాలు ఘన విజయం సా ధించాయని ఆయన ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ ఘటన ను పరోక్షంగా ప్రస్తావించారు. ఇప్పటివరకూ ఉన్న ఆత్మరక్షణ వైఖరిని వీడి పలు స్థాయిల్లోని భద్రతా బలగాలు మావోయిస్టులపై విరుచుకుపడే ధో రణి తో సాగుతున్నాయని విశ్లేషించారు. నక్సల్స్ ప్రభావిత రా ష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం మం త్రులు, ఉన్నతాధికారులతో స్థానిక విజ్ఞాన్‌భవన్ లో ఏర్పాటు అయిన కీలక సదస్సులో అమిత్ షా మాట్లాడారు. కేంద్ర హోం మంత్రిత్వశా ఖ ఆధ్వర్యంలో ఈ కీలక సదస్సు ఏర్పాటు అయింది.

త్వ రలోనే దేశంలో పూర్తి స్థాయిలో నక్సల్స్ ఏరివే త లక్షం ఖ రారు చేసుకున్నట్లు , మావోయిస్టుల తీవ్రవాదం ఇప్పుడు అంతిమదశకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. నక్సల్స్ స మస్య ఉన్న వివిధ రా ష్ట్రాల సిఎంలు కేంద్రం తీసుకుంటు న్న చర్యలకు మరింత సహకారం అందించాల్సి ఉంటుంది. ప్రత్యేకించి కేంద్ర , రాష్ట్ర బలగాల మధ్య సమన్వ యం కీల కం అని తెలిపారు. అత్యధిక స్ధాయిలో నక్సల్స్ చర్యలు జరిగిన కొన్ని రాష్ట్రాలలో ఇటీవలి కాలంలో హింసాత్మక ఘటనలు తగ్గుముఖం ప ట్టాయి. లోక్‌సభ ఎన్నికలలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో అత్యధిక శాతం ఓటింగ్ జరిగింది. ఇంతకు ముందు పోలింగ్ దాదాపుగా లేని స్థితి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. జనం తమంత తాముగా ఓటేసేందుకు తరలివచ్చారు. ఇదంతా కూడా నక్సల్స్ ఏరివేతకు కేంద్రం తీసుకుంటున్న చర్యల ఫలితం అని అమిత్ షా స్పష్టం చేశారు. సోమవారం జరిగిన కీలక సదస్సుకు తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి తరువాయి 6లో

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News