Sunday, February 23, 2025

హిందీ వారధితో దేశ సమైక్యత బంధం: అమిత్ షా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హిందీ భాష దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య వారధిగా నిలుస్తుందని , బహుభాషల భారతదేశంలో సమైక్యతను పరిరక్షించే బంధం అవుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.. గురువారం హిందీ దివస్ నేపథ్యంలో ఆయన సందేశం వెలువరించారు. హిందీ సరళీకృత భాష. పలు విభిన్న భాషలను అక్కున చేర్చుకుంది. సార్వత్రికమైనది. వివిధ భారతీయ భాషల పట్ల సహ సమాదరణ భావనను పొందుపర్చుకున్న భాషగా పేరొందడం వల్లనే ఈ భాష ప్రపంచ భాషలు, వివిధ మాండలికాలలో కూడా తన ప్రత్యేకతను చాటుకొంటోందన్నారు. ఇతర భాషలతో హిందీ భాష ఎప్పుడూ పోటీపడలేదని, భారతీయ భాషలన్నింటిని బలోపేతం చేయడం వల్లనే దేశం పటిష్టం అవుతుందని తెలిపారు. పలు భాషల అనుసంధాన భాషగా హిందీకి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News