Tuesday, November 5, 2024

కన్నడిగులను బెదిరిస్తున్న అమిత్ షా: జైరాం రమేష్

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అల్లర్లు జరుగుతాయంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ఉద్దేశించిన ప్రకటనగా కాంగ్రెస్ అభివర్ణించింది. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ ఆరోపించింది. కర్నాటకలోని బెలగావి జిల్లాలో మంగళవారం ఒక బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తూ..రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృధి తిరోగమన దిశలో పయనిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారసత్వ రాజకీయాలు పెచ్చుమీరతాయని, అల్లర్లతో రాష్ట్రం అల్లకల్లోలమవుతుందని కూడా ఆయన ఆరోపించారు.

Also Read: లవర్ ఇంట్లో బాలిక ఆత్మహత్య

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ఓటమి భయంతోనే అమిత్ షా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. భారతదేశ తొలి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిషేధించిన సంస్థతో సంబంధాలు ఉన్న ఇప్పటి హోం మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హెచ్చరికలు జారీచేస్తున్నారని విమర్శించారు. అమిత్ షా వ్యాఖ్యలు 6.5 కోట్ల మంది కన్నడిగులను అవమానించడమేనని ఆయన అన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10న జరగనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News