Monday, December 23, 2024

10న ఆదిలాబాద్‌కు అమిత్ షా

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్రానికి అన్యాయం : కిషన్‌రెడ్డి

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత, నిర్లక్ష్యం కారణంగా తెలంగాణకు పదేళ్లుగా అన్యాయం జరుగుతోందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆరోపించారు. గురువారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారన్నారు. ఆదిలాబాద్ లో జరిగే బిజెపి బహిరంగ సభలో పాల్గొంటారని వెల్లడించారు. జనాభా ప్రాతిపదికన రావాల్సిన రిజర్వేషన్లు ఇవ్వకుండా గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. గిరిజన యూనివర్శిటీ కోసం కావాల్సిన స్థల సేకరణ విషయం ఇంకా తేల్చలేదన్నారు.  50 ఎకరాలకు అనుమతులు రావాల్సి ఉందన్నారు.

ఎపిలో యూనివర్శిటీ మంజూరు అయింది. నిధులు కూడా మంజూరయ్యాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తమ దగ్గర తప్పు పెట్టుకుని కేంద్రంపై అనవసర విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి సమస్యలు పరిష్కరించుకోవాలనే ఆలోచన లేదని విమర్శించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఫీజబుల్టి కాదు. గతంలో కేంద్రం చెప్పింది. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం అని వెల్లడించారు. ఉద్యోగ నియామకాల విషయంలో తెలంగాణ యువతకు వెన్నుపోటు పొడిచారు. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ కు సంబంధించి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించి ప్రజలకు న్యాయం చేయాలి. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలపై భారం పడుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News