Saturday, November 16, 2024

నేడే లోక్‌సభలో జగడపు ఢిల్లీ బిల్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం మంగళవారం (నేడు) లోక్‌సభలో జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ (సవరణ) బిల్లు 2023ను ప్రవేశపెట్టనుంది. దేశ రాజధానిలో ప్రభుత్వ ఉద్యోగుల నియమాకాలు, బదిలీ వ్యవహారాల అధికారాలను కేంద్రం తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు తీసుకువచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లు రానుంది. సంబంధిత విషయం కేంద్రం, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం మధ్య తీవ్రస్థాయి వివాదానికి దారితీసింది. ఇంతకు ముందు సుప్రీంకోర్టు దేశ రాజధానిలో ప్రభుత్వ అధికారులపై ఢిల్లీ ప్రభుత్వానికే ఎక్కువ అధికారాలు ఉంటాయని తీర్పు ఇచ్చింది. దీనిని కాదంటూ కేంద్రం మే 19న ఆర్డినెన్స్‌ను తీసుకురావడం చిచ్చు రగిల్చింది.

ఈ ఆర్డినెన్స్ స్థానంలో ఇప్పుడు బిల్లు తేవడానికి రంగం సిద్ధం అయింది. సంబంధిత బిల్లు పత్రాలు శనివారం పార్లమెంట్‌కు చేరాయి. నిజానికి సోమవారమే ఈ బిల్లును హోం మంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ఇందులో మరికొన్ని నిర్థిష్ట మార్పులు చేసింది. దీనితో ఇప్పుడు మరుసటిరోజు బిల్లు రానుందని వెల్లడైంది. ఇప్పటికే మణిపూర్ అంశంపై విపక్షాల నుంచి సంఘటితంగా ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం అవుతున్న దశలోనే ఈ ఢిల్లీ బిల్లు రావడంపై ప్రతిపక్ష కూటమి ఇండియా స్పందన కీలకం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News