14న తిరుపతిలో దక్షిణాది సిఎంల భేటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఈ నెల 14న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని నిర్వహించనుంది. కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా అధ్యక్షతన తిరుపతిలో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు , కేరళ, కర్ణాటక , పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు . తెలుగు రాష్ట్రాలకు ఈ సమావేశం అంత్యంత కీలకంగా మారనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌విభజన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజనచట్టంలోని హామీలు ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావనకు రానున్నాయి. అంతే కాకుండా జాతీయ జలవిధానంపై కూడా చర్చించనున్నారు. ఉత్తర దక్షిణ భారతాన్ని కతుపుతూ బ్రహ్మపుత్రకావేరి నదుల అనుసంధానంలో భాగంగా తొలిదశ కింద కేంద్రం చేపట్టిన గోదావరికావేరి నదుల అనుసంధానం ప్రతిపాదనలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు అధికరారులు వెల్లడించారు.