Monday, December 23, 2024

నేడు కేంద్ర మంత్రి అమిత్‌షా సూర్యాపేట పర్యటన

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నేడు రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల్లో ఆపార్టీ అగ్ర నాయకుల చరిష్మాను వాడుకొనేందుకు రాష్ట్ర బిజెసి సీనియర్లు వ్యుహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత నెలలో మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించి పలు హామీలు కురిపించారు. తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పర్యటించి పలు సమావేశాల్లో పాల్గొన్ని వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలు చురుకుగా పనిచేసి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు గడప గడపకు వివరించాలని కార్యకర్తలను కోరారు.

శుక్రవారం సాయంత్రం సూర్యాపేటలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొన్ని ప్రసంగించనున్నట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు. అదే విధంగా జాతీయ పోలీస్ అకాడమీలో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు 75వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొని మధ్యాహ్నం 3 గంటలకు సూర్యాపేటకు అమిత్‌షా బయలుదేరి 4 నుంచి 5 గంటల వరకు బహిరంగ సభలో ప్రసంగించి సాయంత్రం 5.45 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అమిత్‌షా చేరుకుంటారని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News