Thursday, December 26, 2024

28న అమిత్ షా రాష్ట్ర పర్యటన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఖరారైంది. ఈనెల 28,29 తేదీలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అమిత్ షా పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా 28వ తేదీన కొమురం భీమ్ పురిటిగడ్డ జోడేఘాట్‌ను ఆయన సందర్శించి నివాళి అర్పించనున్నారు.

అలాగే 29న ఆదిలాబాద్, ఉట్నూరు, అసిఫాబాద్ ఈ మూడు ప్రాంతాల్లో ఏదో ఒక చోట అమిత్ షా బహిరంగ సభ ఉంటుందని పార్టీ సీనియర్ నేత రావుల రామనాథ్ సూచన ప్రాయంగా తెలియజేశారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నేతలు, మంచిర్యాల బూత్ కమిటీ సభ్యులతో అమిత్ షా సమావేశం కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News