లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బిజెపి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించింది. మరోసారి అధికారం చేపట్టాలని లక్ష్యంగా బిజెపి అధిష్టానం అడుగులేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణపై బిజెపి ఫుల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో అత్యధిక ఎంపి సీట్లు గెలుపే లక్ష్యంగా స్థానిక నాయకులకు దిశా నిర్దేశం చేస్తోంది. దీంతో యాత్రల పేరుతో బిజెపి నాయకులు జనాల్లోకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపిందుకు అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. మార్చి 12న అమిత్ షా తెలంగాణకు రానున్నారు.
ఈ సందర్బంగా పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పలు అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేసిన సంగతి తెలిసిందే. అనంతరం పటాన్ చెరులో జరిగిన బిజెపి విజయ సంకల్ప యాత్రలో పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేలా ప్రసంగించారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని ఫైర్ అయ్యారు.