Sunday, January 19, 2025

14న హైదరాబాద్‌కు అమిత్ షా రాక

- Advertisement -
- Advertisement -

Amit Shah to visit Telangana on May 14

హైదరాబాద్ : బిజెపి అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 14న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2.30కి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు అమిత్ షా రానున్నారు. సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను సందర్శించనున్నారు. 14న సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ నోవాటెల్‌కు అమిత్ షా రానున్నారు. 14న సాయంత్రం 6.30 గంటలకు తుక్కుగుడా సభాస్థలికి హోంమంత్రి చేరుకుంటారు. అదే రోజు రాత్రి 8.25 గంటలకు ఢిల్లీకి బయల్దేరి వెళతారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగుతున్న రాష్ట్ర బిజెపి చీఫ్ బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర మే 14న మహేశ్వరంలో ముగుస్తుంది. ఈ సభకు అమిత్ షా రానున్నారు. తెలంగాణలో అధికార టిఆర్‌ఎస్‌పై కేంద్రం, బిజెపి రాజకీయ పోరాటం తీవ్రమవుతున్న తరుణంలో అమిత్ షా రాష్ట్రానికి రానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News