Monday, January 20, 2025

ఈ నెల 5న అమిత్ షా, 6న జెపి నడ్డా తెలంగాణలో పర్యటన

- Advertisement -
- Advertisement -

ఈ నెల 5 న అమిత్ షా, 6న జెపి నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రచార షెడ్యూల్‌ను బిజెపి విడుదల చేసింది. 5న ఉదయం 11:30 గంటలకు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సిర్పూర్ కాగజ్‌నగర్ లో బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు నిజామాబాద్ పార్లమెంట్ నిజామాబాదులో బహిరంగ సభకు విచేస్తారు. సాయంత్రం 4 గంటలకు మల్కాజ్ గిరి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అమిత్‌షా పాల్గొననున్నారు. ఈ నెల 6న బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా 11 గంటలకు పెద్దపల్లిలో మధ్యాహ్నం 1గంటకు, భువనగిరిలో మధ్యాహ్నం 3.30 గంటలకు నల్గొండలో జరగనున్న బహిరంగ సభలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News