Monday, December 23, 2024

వర్షంతో అమిత్ షా పర్యటన మరోసారి వాయిదా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా బిజెపి అగ్ర నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 29న అమిత్ షా.. హైదరాబాద్ షెడ్యూల్ ఖారరైంది. ప్రస్తుతం రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పర్యటన వాయిదా పడిందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ వి సుభాష్ తెలిపారు. త్వరలోనే అమిత్ షా పర్యటనను ఖారారు చేసే వీలుందన్నారు. వాస్తవానికి 2023 జూన్ 15న ఖమ్మం జిల్లా భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొనాల్సి ఉంది.

ఈ సభకు తాను వస్తానని అమిత్ షా కూడా మాట ఇచ్చారు. ఈ మేరకు బిజెపి నేతలు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు కూడా చేశారు. అదే సమయంలో గుజరాత్ లో వచ్చిన సైక్లోన్ తో అది వాయిదా పడింది. దీంతో ఖమ్మంలో జరగాల్సిన అమిత్ షా కార్యక్రమానికి జూలై 29కి బిజెపి రాష్ట్ర శాఖ హైదరాబాద్‌కు మార్చుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు ఏకధాటిగా కురుస్తుండంటంతో మరోసారి అమిత్ షా పర్యటన వాయిదా పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News